వారంలో కనీసం రెండుసార్లయినా తమలపాకులు వేసుకోవాలి, ఎందుకంటే?

తమలపాకులు. వీటిని తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. రాత్రిపూట తమలపాకులను బాగా కడిగి ఆ తర్వాత వాటిని నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. తమలపాకు ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు రసంతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది.

తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే గొంతు సమస్య తగ్గుతుంది.

తలనొప్పి, మైగ్రేన్ సమస్యలున్నవారు తమలపాకులు తింటే మంచి ఫలితం వుంటుంది.

కడుపు ఉబ్బరంగా వుంటే తమలపాకులు తింటే ఉపశమనం కలుగుతుంది.

తమలపాకులు తింటుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుందని తేలింది.

ఆకలి లేకపోయినా, నోటికి రుచి లేకపోయినా రెండు తమలపాకులు నమిలితే ఆకలవుతుంది.

వారంలో కనీసం రెండుసార్లయినా తమలపాకులు వేసుకుంటే వాటిద్వారా శరీరానికి ప్రయోజనం చేకూరుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

సబ్జా గింజలు వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో తెలుసా?

Follow Us on :-