మధుమేహ వ్యాధిగ్రస్తులు హ్యాపీగా ఈ టీలు తాగవచ్చు, అవేంటి?
ఉదయం లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే మధుమేహం ఉంటే మాత్రం టీని వదులుకోవాల్సి వస్తుంది. ఐతే వారు త్రాగడానికి అనువైన, ఆరోగ్యకరమైన కొన్ని టీలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
Credit: pixabay
గ్రీన్ టీ తాగుతుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
బ్లాక్ టీ అని పిలువబడే నాన్-డైరీ టీ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది.
చామంతి పూలతో చేసే టీ కెఫిన్ పదార్థాలు లేకుండా పువ్వుల నుండి తయారైన టీ. ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
ఒక కప్పు అల్లం టీ మధుమేహం వున్నవారు తాగవచ్చు. ఐతే ఇందులో చక్కెర లేకుండా తీసుకోవాలి.
మందార టీలో ఆర్గానిక్ యాసిడ్స్, ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది.
హై బ్లడ్ షుగర్ సమస్య ఉన్నవారు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన టర్మరిక్ టీని తాగవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి,