లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలతో ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది.
ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
రోజూ లవంగం తీసుకుంటే కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి.
లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గించి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
లవంగాలు తింటుంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది.
ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణను సంప్రదించాలి.