చుండ్రు వదిలించుకునేందుకు తలస్నానం చేసేందుకు సరైన మార్గం

మహిళలు జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఖరీదైన ఉత్పత్తుల నుండి హెయిర్ ట్రీట్‌మెంట్ వంటివి చాలానే ఉపయోగిస్తున్నారు. అయితే ఇంతచేసినా కూడా జుట్టు నిర్వహణలో సమస్య అలాగే వుంటుంది. ఇది చుండ్రు, జుట్టు రాలడం తదితరాలకు దారితీస్తుంది. చుండ్రు వదిలించుకునే మార్గం ఏమిటో తెలుసుకుందాము.

webdunia

చుండ్రును పోగొట్టుకోవడానికి తలస్నానం చేయడానికి మధ్య సంబంధం వుందని బ్యూటీషియన్లు అంటున్నారు.

జుట్టును సరిగ్గా కడగకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

జుట్టు తలస్నానం చేసేముందు జుట్టుకు నూనె రాయడం కొందరికి అలవాటు, అలా రాయకూడదు.

చుండ్రు లేకుండా ఉండాలంటే కనీసం వారానికి ఒకసారి తలపై నూనెతో మసాజ్ చేయాలి.

ప్రతిరోజూ తలపై బలమైన రసాయనం కలిగిన షాంపూని ఉపయోగిస్తుంటే అది చెడు ఫలితాన్ని ఇస్తుంది.

జుట్టును చుండ్రు నుండి రక్షించుకోవడానికి ఆర్గానిక్ షాంపూని ఉపయోగించాలి.

జుట్టు కడుక్కునేటపుడు తలపై ఎక్కువగా రుద్దకండి. చేతులతో తేలికగా మసాజ్ చేయాలి.

అంజీర తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటవి?

Follow Us on :-