టీ తాగుతూ దానిలో ఇవి కలిపి తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

ఈ రోజుల్లో టీ, కాఫీలు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ టీ, కాఫీలతో పాటు కొన్నింటిని తినరాదు. అలాగే ఇవి తీసుకునే ముందు కానీ తర్వాత కానీ కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం వుంది. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి కనుక వాటిని తీసుకోరాదు.

సలాడ్, మొలకెత్తిన గింజలు లేదా ఉడికించిన గుడ్లు వంటి పచ్చి పదార్థాలను టీతో తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తెస్తాయి.

టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోరాదు, ఇలా తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.

నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా సేవించరాదు. అలా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.

టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.

టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం చేయరాదు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.

జామ పండు, జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Follow Us on :-