ఊరగాయ పచ్చళ్లు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

చలికాలంలో పచ్చళ్లను కూరతో పాటుగా కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. పచ్చళ్లతో కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

పచ్చళ్లు జీర్ణవ్యవస్థను, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, నూనెతో ఊరగాయలను తయారు చేస్తారు.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా వుండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఉసిరికాయ, ముల్లంగి ఊరగాయలు హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

చలికాలంలో తయారైన ఊరగాయలు డయాబెటిక్ పేషెంట్లలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఊరగాయలు కాలేయానికి మంచివిగా భావిస్తారు. ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్‌ను అందిస్తాయి.

పచ్చళ్లలో రుబ్బిన మసాలా దినుసులు వాడటం వల్ల పోషకాలు అధికంగా ఉంటాయి.

సీజనల్ ఊరగాయలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుండొచ్చు కానీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచివి కావని గుర్తుంచుకోవాలి.

గమనిక: ఊరగాయ పచ్చళ్లు బీపీ పేషెంట్లకు మంచివి కాదు, చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

ఉదయం వేళ ఖాళీ కడుపుతో గోరువెచ్చని మంచినీరు తాగితే ఏమవుతుంది?

Follow Us on :-