ఎర్ర జామకాయలు. తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది.
తెల్ల జామకాయతో పోలీస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది.
సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఎర్ర జామ పండును మధుమేహం వున్నవారు కూడా తినవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.