ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఆముదం నూనె. ఇదివరకు శిశువు ఆరోగ్యం కోసం అందరూ ఆముదం వాడేవారు. ఆముదం నూనెను కనీసం వారానికి ఒకసారి పట్టిస్తే జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారి కేశాలు ఆరోగ్యవంతంగా వుంటాయి. ఆముదం నూనెతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఆముదం నూనెను తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారి కేశాలు ఆరోగ్యవంతంగా వుంటాయి.

లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారి.

నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు.

ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు, వళ్లు నొప్పులు తగ్గుతాయి.

ఎండ వల్ల కమిలిన చర్మం సాధారణ స్థితికి తెచ్చేందుకు ఆముదంతో మర్దన చేస్తే ఫలితం వుంటుంది.

ఆముదం చర్మం మీద అప్లై చేస్తే బిగుతుగా తయారై ముడతలు తగ్గుతాయి.

ఆముదంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. జుట్టు పెరుగుదలకు ఆముదం నూనె ఎంతో మేలు చేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-