రక్తంలో ప్లేట్‌ లెట్స్‌ను పెంచే 9 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

ఎముక మూలుగల్లో ప్లేట్‌ లెట్స్ ఉంటాయి. ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తిలో క్యూబిక్ మిల్లీమీటర్ పరిమాణంలో 1.5-4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉండాలి. ఐతే కొన్నిరకాల జ్వరాలు వ‌చ్చిన‌ప్పుడు ఇవి ఎక్కువ‌గా క్షీణిస్తాయి. దీంతో ఆరోగ్యం విషమించి ప్రాణాపాయ స్థితి వ‌స్తుంది. ఐతే అలాంటి సమస్యను మందుల‌తో పాటుగా కింద పేర్కొన్న ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవ‌చ్చు. అవేంటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బొప్పాయి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.

దానిమ్మ పండ్ల‌ను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగడంతో పాటు ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది.

ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను తింటే వాటిలోని విట‌మిన్ కె ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

వెల్లుల్లి రేకుల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.

బీట్ రూట్ జ్యూస్‌ను తాగుతుంటే కూడా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

క్యారెట్‌ను త‌ర‌చూ తింటున్నా ర‌క్తం వృద్ధి చెంది తద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

ఎండు ద్రాక్ష‌ల్లో 30 శాతం ఐర‌న్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

ఆప్రికాట్ పండ్ల‌ను తీసుకున్నా ర‌క్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

ఎండు ఖ‌ర్జూరం, కివీ పండ్ల‌ను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవ‌చ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

స్లిమ్‌గా మారాలనుకున్నవారికి ఈ ఫుడ్‌తో ప్రయోజనం

Follow Us on :-