శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

ఆయుర్వేదం ప్రకారం, శీతాకాలం అనేది సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే సీజన్. చల్లని వాతావరణం శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ పరివర్తన అనేక శీతాకాలపు వ్యాధుల ద్వారా కనబరుస్తుంది. శీతాకాలంలో కొన్ని సులభమైన జాగ్రత్తలను అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యవంతమైన ఆరోగ్య చిట్కాలు.

credit: social media and webdunia

తృణధాన్యాలు, చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, గింజలు, సుగంధ ద్రవ్యాలు అలాగే పుష్కలంగా తాజా పండ్లు, కూరగాయలతో సహా సమతుల్య ఆహారం తీసుకోవాలి.

విటమిన్ సి అధికంగా ఉండే కమలాలు, నిమ్మకాయలు వంటివి తింటుండాలి.

చలికాలం అంతా ఫిట్‌గా ఉండటానికి శారీరక శ్రమ ఒక ముఖ్యమైన అంశం.

చర్మ సంరక్షణలో తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అప్లై చేయడం, నీటిని తీసుకోవడం వంటివి చేయాలి.

ప్రతి రోజు అవసరమైన మొత్తంలో నీరు త్రాగండి, హైడ్రేటెడ్‌గా ఉండండి.

కావలసినంత నిద్ర శరీర రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను తొలగిస్తుంది.

పరిశుభ్రత పాటించండి, బ్యాక్టీరియా- వైరస్‌లు వ్యాప్తి చెందకుండా, చర్మ సమస్యలు రాకుండా ఉండటానికి చేతులు కడుక్కోవాలి.

వింటర్ సీజన్ జాగ్రత్తలులో భాగంగా రెగ్యులర్ హెల్త్ చెకప్‌ని చేయించుకుంటుండాలి.

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-