విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది చర్మం, మృదులాస్థి, రక్త నాళాలు వంటి కణజాలాల పెరుగుదలలో సహాయపడుతుంది. ఇది గాయాలను నయం చేయడానికి, ఎముకలు, దంతాల పనితీరుకి కూడా ముఖ్యమైనది. విటమిన్ సి వల్ల కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అధిక రక్తపోటును నిర్వహించడంలో దోహదపడుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా వుంటుంది.
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి గౌట్ సమస్య నివారించడంలో సహాయపడుతుంది.
శరీరంలో ఇనుము లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి ఎంతో మేలు చేస్తుంది.
వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
జామ, మామిడి, నల్ల ఎండుద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్, నారింజ, కివిఫ్రూట్లలో ఇది లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.