క్యాల్షియం పుష్కలంగా లభించే 6 డ్రై ఫ్రూట్స్ ఇవే

చాలామంది నడుము నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటివారిలో సరిపడినంత క్యాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం లభించే డ్రైఫ్రూట్స్ తింటుంటే శరీరానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

అంజీర తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి వంద గ్రాముల అంజీరలో 160 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది.

ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి.గ్రా క్యాల్షియం దొరుకుతుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదములలో 76 మి.గ్రాముల క్యాల్షియం వుంటుంది.

తీయగా వుండే ఖర్జూరాల్లో ప్రతి వంద గ్రాములకు 64 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.

పిస్తా పప్పులు తింటుంటే వాటి ద్వారా శరీరానికి క్యాల్షియం అందుతుంది.

ప్రతి వంద గ్రాముల వాల్ నట్స్ లో 98 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

మంచినీళ్లు ఇలా తాగి చూడండి మీకే తెలుస్తుంది

Follow Us on :-