Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమకు ప్రశ్నలుండవు

ప్రేమకు ప్రశ్నలుండవు

Gulzar Ghouse

భూమి గుండ్రంగావుంటుందన్నది జగమెరిగిన సత్యం. ప్రేమలో తిరస్కారం, హేళన, చీవాట్లు, నిరీక్షణ, విరహం ఇలా చెప్పుకుంటూపోతే చాలానేవుంటాయి. ప్రేమ అనేది వీటినుండే పుడుతుందంటున్నారు పరిశోధకులు.

ఇక్కడ సంబంధబాంధవ్యాలు, ప్రేమతో ముడిపడివుంటాయి. కొన్నిసందర్భాలలో ప్రేమ విఫలమైతే బంధాలు తెగిపోతాయి. ప్రేమలో కేవలం ఇద్దరు. ఆ ఇద్దరితో బాటు ప్రపంచం. ఈ ప్రేమ కూడా రెండు మనసుల కలయితోనే ఏర్పడుతుంది.

స్వచ్ఛమైన ప్రేమకు అప్పుడప్పుడు కాస్త అపనమ్మకం కూడా తోడవుతుంది. దీంతో ప్రేమికులిరువురూ విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీటి వలన ఇరువురూ మానసికంగా నలిగిపోతారు.

మనం ఎక్కడినుంచైతే ప్రేమ అనే ప్రయాణాన్ని ప్రారంభించామో మళ్ళీ అక్కడికే రాక మానదు. అప్పటికిగాని తెలిసిరాదు మనం ఎంత తప్పు చేశామోనని. కాని ఇక్కడ ఎదుటివారు మనలను బాధకు గురి చేసినప్పుడు కలిగే బాధ అంతా ఇంతా కాదంటున్నారు విశ్లేషకులు.

కాని ఆ ప్రేమ యొక్క సుగంధం ప్రతి క్షణం మీకు వెంటాడుతూనే ఉంటుంది. తేడా ఎక్కడంటే మీ ప్రియురాలు/ ప్రియుడు పక్కన లేకపోవడమే విచారకరం. కాని ఆ మధుర జ్ఞాపకాలు మాత్రం మిమ్ములను ఉక్కిరిబిక్కరి చేస్తుంటాయి. ప్రేమలో మునిగినప్పుడు మీరు ఎంత ఆనందాన్ని పొందారో అది మీకు గుర్తుకు వస్తూనేవుంటుంది.

చివరికి దీనిపేరు ప్రేమే కదా.. నిజమైన ప్రేమ ఏదంటే ఆ ప్రేమలో మీరు మునిగిపోయుంటే మిమ్మల్ని మీరు మరచిపోతారు. హ్రుదయం మీ వద్ద లేనప్పుడుకూడా ఆ విరహం, ఆ బాధ వర్ణనాతీతం. అది ఒక తియ్యటి బాధ. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించరు.

ప్రేమలో ప్రశ్నలుండవు. ప్రేమ అనేది త్యాగాలకు చిహ్నం. ఎక్కడైతే నిజమైన ప్రేమ వుంటుందో అక్కడ ప్రశ్నలకు తావుండదు. ప్రేమ లేని చోటే ప్రశ్నలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తాయి.

ప్రేమలో నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకమే లేనప్పుడు ప్రేమించడం వ్యర్థం. ప్రేమకోసం తమ జీవితాలు, రాజ్యాలను త్యాగం చేసిన ఘనులు ప్రేమ సామ్రాజ్యంలో ఎందరో ఉన్నారు. ఇతరులు చెప్పే మాటలను నమ్మి మీరు తీసుకునే నిర్ణయాలవలన మీ ప్రేమకే కళంకం.

అలాంటప్పుడు మీరు ప్రేమించడం వృధా. ఆ ప్రేమకు అర్థంవుండదు. రకరకాల ప్రశ్నలు మీలో తలెత్తుతాయి. కాబట్టి ప్రేమించే ప్రేమికులు కాస్త మీ "స్వీట్‌హార్ట్‌"‌పై నమ్మకంవుంచండి. మీ ప్రేమకు జీవంపోయండి.

Share this Story:

Follow Webdunia telugu