Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

Advertiesment
The Bengal files poster

దేవీ

, శనివారం, 16 ఆగస్టు 2025 (15:31 IST)
The Bengal files poster
వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ విడుదలైంది. అయితే ఇందులో చాలా అంశాలు ఆలోచించేవిగా, వివాదాస్పదంగా మారాయి. ఓ భారత్ నై, యే పుచ్చిమ్ బెంగాల్, ఇదర్ హిందూ, ముసల్ మాన్ గా రాజ్ చల్ తా హై.. అంటూ డైలాగ్ తో ఆరంభమవుతోంది. ఆ తర్వాత గాంధీ జిన్నాల మధ్య చర్చ మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది. జిన్నా నుద్దేశించి.. జిన్నా, మేరా భాయ్.. హిందూ కన్ వర్టెటెడ్ ముసలామ్.. మీది మాది ఒకే రక్తం. మనం అంతా ఒక్కటే అనగానే.. కాదు అంటూ.. మీ వేదాలు, పురాణాలు నమ్ముతారు. కానీ మేం అల్లాను మాత్రమే నమ్ముతాం.. పలికే డైలాగ్ వుంటుంది.
 
ఇలా సాగిపోతూ. 1947 లో రెండు భాగాలైన ఇండియా, పాకిస్తాన్ ఆ తర్వాత కూడా లక్షలాది మంది ప్రాణాలు కోల్పయారు. అయినా అగ్గి చల్లారలేదు. దేశం అగ్నిగోళంగా మండుతోంది. ప్రజలు బాంబు దాడులతో రక్తం ఏరులై పారుతోంది. ఇదంతా ఓ క్రీడ అంటూ.. సాగే డైలాగ్ తో ముగుస్తుంది. ఈ చిత్రంలో వాస్తవం, అవాస్తం ఎంతమేర వుందో కానీ.. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నేడు జరగాల్సి ఆఖరి నిముసంలో కాన్సిల్ కావడం విశేషం.
 
వివేక్ అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ ను వార్ 2,  కూలీ ప్రదర్శించే థియేటర్లలో వేయనున్నారు. కాగా, ట్రైలర్ తో కోల్‌కతా మే హాయ్ లాంచ్ హోగా,' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత బెంగాల్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నమాట.
 
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం బెంగాల్ ఫైల్స్ బృందం ఆగస్టు 15న కోల్‌కతాకు చేరుకుంది. అయితే, చివరి నిమిషంలో వేదిక ఈవెంట్‌ను రద్దు చేయడంతో వారు నిరాశ చెందారు. ఈ ఈవెంట్‌ను నిర్వహించడానికి అవసరమైన అన్ని అనుమతులను బృందం పొందిందని చిత్ర నిర్మాత స్పష్టం చేశారు. ఒక వీడియోలో, అతను ఇలా అన్నాడు, “లాంచ్ కోసం మాకు అన్ని అనుమతులు ఉన్నాయి. మా మొత్తం బృందం వచ్చింది, కానీ ఇప్పుడు ఈవెంట్ రద్దు చేయబడిందని మేము తెలుసుకున్నాం.
 
X (ట్విట్టర్)లో తన పోస్ట్‌లో, వివేక్ అగ్నిహోత్రి "రాజకీయ ఒత్తిడి" కారణంగా రద్దు జరిగిందని పేర్కొన్నారు. "ఇప్పుడే కోల్‌కతాకు చేరుకున్నాను మరియు #TheBengalFiles ట్రైలర్ లాంచ్ వేదిక రద్దు చేయబడిందని తెలుసుకున్నాను. మన గొంతును ఎవరు అణచివేయాలనుకుంటున్నారు? మరియు ఎందుకు? కానీ నన్ను నిశ్శబ్దం చేయలేము. ఎందుకంటే సత్యాన్ని నిశ్శబ్దం చేయలేము." అనే క్యాప్షన్‌తో అతను వీడియోను పంచుకున్నాడు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో సెప్టెంబర్ 5న విడుదలకాబోతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)