ఇందులో నటీనటులు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది ఆరుగురు యువతీయువకుల కథ. బెంగుళూరులో ఓ అడవి ప్రాంతంలో జరిగిన కథను చిత్రంగా మార్చి థియేటర్‌కు తీసుకువచ్చారు గుడ్ సినిమా పిక్చర్స్ అధినేత శ్రీనివాస్, సురేంద్రలు. దీనికి దర్శకుడు మారుతీ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
2010లో ఆరుగురు ఫ్రెండ్స్ సరదాగా ట్రెక్కింగ్ చేయడానికి మంగుళూరుకు 90 కి.మీ. దూరంలో ఉన్న అడవికి వెళ్ళారు. అక్కడి వెళ్లే సమయంలో వారికి ఎదురైనా అనుభవాలే సినిమా. సరదాలు, జోక్‌లు, అలకలు, మందు కొట్టడాలు. ఇలాంటివన్నీ చేసి... ఓ దశలో రాత్రిపూట అడవిలో వెళుతూ... ఓ చోట బస చేస్తారు. కానీ అది సరైన ప్లేస్ కాదు. ఆకులు లేని చెట్టుకు పుర్రెలు వేలాడితీసి వుంటాయి. అయినా యువరక్తం కనుక దాన్నేమీ లెక్కచేయకుండా ఓ పుర్రెను తమ వద్దే వుంచుకుంటారు.
అలా దానిద్వారా రాత్రి వింత వింత శబ్దాలు, ఎవరో వెంటాడుతున్నట్లు అనిపిస్తాయి. ఎలాగోలా తెల్లారి లేచి... కొండ శిఖరానికి చేరుకుని ఆనందిస్తారు. అందులో ఒకరిని మధ్యలోనే విడిచేస్తారు ఆరోగ్యం బాగోలేదని. ఆ తర్వాత ఐదుగురు కొండ పైనుంచి తిరిగి వస్తూ మధ్యలో ఓ దెయ్యం తాలూకు ఛాయల్తో భయభ్రాంతులై... దారి మారిపోతారు. చివరికి ఎక్కడ భయపడ్డారో... రోజు తర్వాత అక్కడికే వస్తారు. ఆ తర్వాత.. ఒక్కోరు మరణిస్తారు. ఇద్దరు ఆచూకీ గల్లంతవుతుంది. ఈ విషయాన్ని జ్వరం వచ్చి కొండకు ఎక్కకుండా వున్న వ్యక్తి.. ఫారెస్ట్ అధికారులకు చెబుతాడు. వారు వచ్చి.. ఓ కెమెరాను చూస్తారు. ఆ కెమెరాలో వున్నవే ఈ చిత్రం తాలూకు రిపోర్ట్స్...
షార్ట్ ఫిలింలా తీసిన ఇటువంటిదాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నమే విశేషం. ఈ ఫిలిం చూడ్డానికి ఇంట్రెస్ట్‌గా వుంది. అయితే కన్నడలో విడుదలైన ఈ ఫుటేజ్... థియేటర్లలో ఆదరణ పొందిందట. ఆ విషయాన్ని తెలుగు నిర్మాతలు చెబుతున్నారు. మొత్తానికి ఇదో ఇంట్రెస్ట్ ఫుటేజ్‌లా అనిపిస్తుంది. అయితే జ్వరం వచ్చి కొండ ఎక్కనివాడు ఎలా బతికాడో.. అనేది స్పష్టత లేదు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో వెయిట్ అండ్ సీ.