విజయశాంతి లేడి ఓరియెంటెడ్ పాత్రలైతే చేసేందుకు రెడీ అంటోందట. ప్రతిఘటన తర్వాత పాపులర్ అయిన విజయశాంతి.. ఓసేయ్రావులమ్మా చిత్రంలో మరో కోణంలో నటించి అదరగొట్టింది. ఆ తర్వాత చలా చిత్రాలు చేసిన అనుభవంతో రాజకీయాల్లోకి వెళ్ళింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీలో చేరి అంతే ఇదిగా బయటకు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విజయశాంతి మళ్లీ సొంతగూటికే చేరనున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే మళ్లీ సినిమాల వైపు విజయశాంతి దృష్టి పెట్టిందని ఫిలింనగర్లో కథనాలు విన్పిస్తున్నాయి. ఈసారి లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించేందుకే ఆమె ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ నిర్మాత అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యం వున్న కథలో వస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ టాపిక్ విన్పిస్తోంది.
చిరంజీవి 150 సినిమాకు ఆగస్టు 22న తన పుట్టినరోజునాడు సన్నాహాలు చేస్తున్నారు. ఆ టైమ్‌లోనే విజయశాంతి సినిమా లైన్లోకి వస్తుందని తెలుస్తోంది. మరోవైపు విజయశాంతి బాహుబలి ఎఫెక్ట్‌తోనే సినిమాల్లోకి వస్తున్నట్లు టాక్ వస్తోంది.
బాహుబలిలో రమ్యకృష్ణ రోల్‌తో స్ఫూర్తి చెందే మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకా చిరంజీవి 150వ సినిమా ప్రకటన విడుదలైనప్పుడే.. విజయశాంతి ఎందుకు తన సినిమా గురించి ప్రకటన చేయనుందని సమాచారం.