Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? వరలక్ష్మి శరత్ కుమార్

varalakshmi

ఠాగూర్

, శుక్రవారం, 12 జనవరి 2024 (14:15 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా అని నటి వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. ఆమె పుట్టి పెరిగింది తమిళనాట. కానీ, ఆమెకు తమిళ చిత్రపరిశ్రమలో కంటే తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఫలితంగా ఆమె బిజీ నటిగా మారిపోయారు. అన్ని రకాల పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 
 
ఫలితంగా తెలుగు, తమిళ భాషల్లో లేడీ విలన్ పాత్రలకు ముందుగా ఆమె పేరును పరిశీలిస్తున్నారు. ఈ రెండు భాషల్లోని ప్రేక్షకులు ఆమె విలనిజాన్నీ .. డైలాగ్ డెలివరీని ఇష్టపడుతున్నారు. ఇక కీలకమైన పాత్రలలోను .. ప్రత్యేకమైన పాత్రలలోను ఆమె తన మార్క్ చూపిస్తూ వెళుతోంది. ఆమె నటించిన 'హనుమాన్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ప్రభాస్ చిత్రం సాలార్‌లో నటించేందుకు ఆమెను సంప్రదించగా, ఆమె నిరాకరించినట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై ఆమె స్పందించారు. 
 
'సలార్' సినిమా కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నన్ను అడిగినట్టుగా.. నేను చేయలేకపోయినట్టుగా వస్తున్న వార్తలు పుకారు మాత్రమే. అయినా ప్రభాస్ సినిమా నుంచి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా. అలాంటి అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నాను' అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.
 
కాగా, సాలార్ చిత్రంలో శ్రియా రెడ్డి ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. 'సలార్'పై పగ తీర్చుకోవడానికి ఎదురుచూసే పాత్ర అది. ఆ పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. ముందుగా వరలక్ష్మినే అనుకున్నారనీ, అయితే కొన్ని కారణాల వలన ఆమె చేయలేకపోయిందనే టాక్ కూడా వచ్చింది. దీనిపై ఆమె పై విధంగా క్లారిటీ ఇచ్చింది.
 
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితుడితో కలిసి బాలికను చంపేద్దామని ఆమె ఇంటికి వెళ్లారు. ఎలాగూ హతమారుస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి లైంగికదాడికి పాల్పడి చంపేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానా దగ్గుబాటి భార్య మిహీకా పచ్చబొట్టు