Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

చిత్రాసేన్
శనివారం, 11 అక్టోబరు 2025 (17:48 IST)
Raashi Khanna
పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన ఫాలోయింగ్, ఒరా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఏదో తెలీని శక్తి ఆయనలో వుంది అని హీరోయిన్ రాశి ఖన్నా కితాబిస్తోంది. బాలీవుడ్ లో కూడా నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. తెలుగులో గేప్ రావడానికి కారణం కూడా అదే అంటూ తెలియజేసింది.
 
ప్రస్తుతం తెలుగులో తెలుసుకదా సినిమాలో నటించింది రాశీఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలీడ్ రోల్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా  పలు సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
- తెలుసు కదా లో నాకు నచ్చి అంశం వుంది. చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుకుంటాం. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ వుంది. ఆ పాయింట్ మీరు థియేటర్స్ లో చూడాలి. అది ఆడియన్స్ ని ఎక్సయిట్ చేస్తుంది.
 
- ఈ సినిమా షూటింగ్ లో చాలా సర్ ప్రైజ్ అయ్యాను. అలాంటి సర్ ప్రైజ్ ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ లవ్, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి పాయింట్ తో సినిమా ఇప్పటివరకూ నేను చూడలేదు.
 
- కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నీరజ ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా రాసింది. చాలా లేయర్స్ వున్నాయి. ఇందులో మూడు పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఆ మూడు పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా చేస్తున్నపుడు చాలా ట్రిగ్గర్ అయ్యాను. ఆడియన్స్ కూడా అవుతారు.
 
- సిద్దు ఆన్ సెట్ లో క్రాఫ్ట్ మీద చాలా సీరియస్ గా వుంటారు. ఆయనకి ప్రతి క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ వుంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.
 
- నాకు మైథలాజిక్ సినిమాలు ఇష్టం, అలాగే హారర్ బ్యాక్ డ్రాప్ వున్న కథలు కూడా ఇష్టం.
 
-తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా పాషన్ తో వర్క్ చేస్తారు. మల్లిక గంధ పెద్ద హిట్ అయ్యింది. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments