Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమయం వేస్ట్ చేయొద్దు..ఇతరులకు సహాయపడండి: సన్నీలియోన్

సమయం వేస్ట్ చేయొద్దు..ఇతరులకు సహాయపడండి: సన్నీలియోన్
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:37 IST)
సన్నీ లియోన్ నటించిన ఓ కండోమ్ ప్రచార ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ట్విట్టర్లో సన్నీ లియోన్ స్పందించింది. తనపై వస్తున్న విమర్శలు పనిలేనివాళ్లు చేసేవిగా సన్నీ తేల్చేసింది. "అధికారంలో ఉన్న వ్యక్తులు తమ శక్తిని నాపై ప్రయోగిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. దీనికి బదులుగా అవసరమైన వారికి సహాయపడితే బాగుంటుంది" అని సలహా ఇచ్చింది. 
 
కాగా, సన్నీ లియోన్ ప్రకటనలతో దేశంలో అత్యాచారాలు పెరిగిపోతాయని కొందరు నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో పోర్న్ చిత్రాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఇలాంటి యాడ్స్, సినిమాల్లో విచ్చలవిడిగా అందాలను ఆరబోయడం ద్వారా మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయని అధికారంలో ఉన్న నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలను సన్నీ లియోన్ ఏమాత్రం లెక్కచేయట్లేదని సినీ పండితులు అంటున్నారు. కాగా ఈ ఏడాది సన్నీ లియోన్ ఏక్ పహేలీ లీలా, కుచ్ కుచ్ లోచా హాయ్ సినిమాల్లో నటించింది. అలాగే మస్తీజాదే సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డు రూటు క్లియర్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu