మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

ఠాగూర్
మంగళవారం, 2 డిశెంబరు 2025 (17:41 IST)
తన అభిమానులకు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ఓ విజ్ఞప్తి చేశారు. తనను ఆరాధించవద్దని, అలా చేసే అభిమానులు తనకు అక్కర్లేదని ఆయన అన్నారు. అదేసమయంలో కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను sవసరమై మేరకే ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఫ్యాన్లీ అనే పేరుతో రూపొందించిన ఎంటర్‌టైన్మెంట్ యాప్‌ను పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, ఖైల్ రత్న అవార్డు గ్రహీత్ గుకేష్ తదితరులతో కలిసి ఆయన చెన్నైలో ఆవిష్కరించారు. 
 
ఇందులో శివకార్తికేయన్ మాట్లాడుతూ, కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అభిమానులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను, భగవంతుడిని ఆరాధించాలంటూ విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాని సరైన రీతిలో వినియోగించుకుని, కెరీర్‌లో ముందుకెళ్లాలని సలహా ఇచ్చారు. 
 
'సోషల్‌ మీడియాకు అతుక్కుపోయి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. కెరీర్‌పై దృష్టి పెట్టండి. అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నాకు ఖాతాలున్నా.. ఆయా యాప్స్‌లో ఎప్పుడు? ఏ చర్చ జరుగుతుంటుందో నాకు తెలియదు. మీరు కూడా మీ అవసరం మేరకు సోషల్‌ మీడియాని వాడండి. మిగిలిన విషయాలు పట్టించుకోవద్దు. అలాగే నన్ను అభిమానించే బదులు మీ తల్లిదండ్రులను ఆరాధించండి' అని శివ కార్తికేయన్‌ పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments