సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఆ రోజున తన అభిమానులకు మరిచిపోలేని బహుమతిని ఇచ్చేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నాడట. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా అభిమానులకు పవన్ ఓ గిఫ్ట్‌ను ఇచ్చిన విషయం తెల్సిందే. అదే తాను నటిస్తున్న కొత్త చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'.
అలాగే, తన పుట్టిన రోజున అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. తన పుట్టినరోజు కానుకగా, 'సర్దార్ గబ్బర్ సింగ్' ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది. సెప్టెంబరు ఒకటో తేదీ అర్థరాత్రి 12 గంటలకు ఈ టీజర్‌ని ఆన్లైన్లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
మరోవైపు... పవన్ వీరాభిమాన బాబా సెహగల్. ఇప్పటికే 'కరో కరో జల్సా' అంటూ పవన్ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆ మధ్య పవనిజం అంటూ ఓ పాప్ సాంగ్‌తో అదరగొట్టారు. అలాగే, పవన్ బర్త్ డే సందర్భంగా తాజాగా మరో సాంగ్ సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పవర్ ఓ పవర్ స్టార్ పల్లవితో సాగే ఈ పాటకు తానే సంగీతం సమకూర్చి బాబా సెహగల్ పాడగా... శ్యామ్ కాసర్ల సాహిత్యాన్ని సమకూర్చాడు.
మరోవైపు వరుణ్ తేజ్ కూడా బాబాయికి వరుణ్ తేజ్ 'కంచె' రూపంలో బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వనున్నాడు. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్-2న ఈ "కంచె" మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోందట. మొన్నామద్య విడుదలైన 'కంచె' సినిమా టీజర్ తనకు ఎంతగానో నచ్చినట్టు.. పవన్ ఇప్పటికే కొనియాడాడు కూడా. టీజర్‌ను ప్రశంసించిన పవన్... ట్రైలర్‌కు కూడా ఆశీస్సులు అందిస్తాడనే హోప్‌తో ఉన్నారు చిత్ర యూనిట్.