Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కండలు పెంచుతున్న సమంత.. 100 కేజీలు ఎత్తేసిందట!!

కండలు పెంచుతున్న సమంత.. 100 కేజీలు ఎత్తేసిందట!!
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (16:08 IST)
అందాల నటి సమంత కండలు పెంచుతుందట. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న సమంత... జిమ్ చుట్టూ తిరుగుతోంది. మొన్నటివరకు తేలికపాటి వ్యాయామానికే పరిమితమైన సమంత.. ప్రస్తుతం భారీ ఎత్తున కసరత్తులు మొదలెట్టింది. ఇతర హీరోయిన్లు తరహాలో నిత్యమూ జిమ్‌కు వెళ్ళి వర్కౌట్లు చేస్తోంది. 
 
ఇందులో భాగంగా సమంత ఏకంగా వంద కిలోల బరువును మూడుసార్లు పైకెత్తేసింది. దీన్ని ఆమె ట్రైనర్ తన మొబైల్‌లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్ తర్వాత తన కండల్ని చూపిస్తూ.. చిలిపిగా నవ్వడం కూడా వీడియోలో కనిపించింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్  ప్రిన్స్ మహేష్ తో 'బ్రహ్మోత్సవం' చిత్రంలో నటిస్తున్న సమంత, ఏ చిత్రం కోసం ఇలా కండలు పెంచుతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu