Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత మాకు ఏమీ ఇవ్వదు.. ఇంటికి వచ్చి వెళ్తుందంతే!

సమంత మాకు ఏమీ ఇవ్వదు.. ఇంటికి వచ్చి వెళ్తుందంతే!
, గురువారం, 1 అక్టోబరు 2015 (13:50 IST)
పేదలకు సాయం చేస్తున్నానంటూ.. తనకు వచ్చిన డబ్బులతో ఇతరులకు చేతనైన సాయం చేస్తున్నట్లు సమంత ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వుంటుంది. అయితే సమంత తల్లిదండ్రులకు కూడా పెద్దగా పెట్టదని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు ఆమె ఇంటిపై ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భాగంగానే సమంత తల్లిదండ్రులన్న మాటలే నిదర్శనం. 
 
''పులి'' చిత్ర నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్ల ఇళ్లపై, నటి నయనతార ఇళ్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలో హీరోయిన్ సమంత ఉన్న అపార్ట్‌మెంట్ల సముదాయంలోనే మరో ఫ్లోర్‌లో ఉండే ఆమె తల్లిదండ్రులు ఆదాయ పన్ను అధికారులపైనా, కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా ఫైర్ అయ్యారు. 
 
ఐటీ అధికారులు దాడుల నిమిత్తం వెళ్లినప్పుడు సమంత తండ్రి జోసఫ్ ప్రభు అడ్డుకునేందుకు యత్నించారు. తమ కుమార్తె డబ్బు, నగలు, డాక్యుమెంట్లు తదితరాలను తమకు ఇవ్వదని, అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళుతుందని ఆవేశంగా సమంత పారెంట్స్ వాదించారు. 
 
తామే అద్దె ఇంటిలో నివసిస్తున్నామన్నారు. సమంత షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉందని వారు తెలిపారు. సమంత తల్లిదండ్రుల మాటలను ఏమాత్రం ఖాతరు చేయని అధికారులు, వారింట్లో సోదాలు జరిపి పలు డాక్యుమెంట్లను తనిఖీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu