Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలన్లు మన దగ్గరే వున్నారు: సాయికుమార్‌

విలన్లు మన దగ్గరే వున్నారు: సాయికుమార్‌
, సోమవారం, 27 జులై 2015 (20:39 IST)
నటుడు సాయికుమార్‌ కన్నడ బోర్డర్‌కు చెందినవాడు తెలుగులో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరుపొందిన ఆయన నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. నేడు అంటే.. 27.7.2015న ఆయన పుట్టినరోజు. తన గంభీరమైన స్వరంతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన నటుడిగా ఎదగడానికి వుపయోగపడింది. తండ్రి దివంగత పిజె శర్మ వారసుడిగా వచ్చిన ఆయన సోదరులు రవిశంర్‌, అయ్యప్పశర్మలు. అయ్యప్ప డబ్బింగ్‌ ఆర్టిస్టే.. విలన్‌గా కూడా చేశాడు. ఢమరుకంలో మాంత్రికుడిగా చేసి మెప్పించాడు.
 
అయితే.. ఇద్దరూ కన్నడ పరిశ్రమలో పేరున్న ఆర్టిస్టులు. సాయికుమార్‌ హీరోగా పలు చిత్రాలు చేశాడు. చేస్తున్నాడు కూడా. ఇటీవలే బాహుబలి సినిమా తర్వాత ఆయన మాట్లాడుతూ.. తెలుగులోనే విలన్లు చాలామంది వున్నారు. మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టులు వున్నారు. వారిని సరిగ్గా వినియోగించుకోమని వ్యాఖ్యానించారు. కన్నడంలో తనకు గుర్తింపు వచ్చింది. అక్కడి పోలీస్‌ స్టోరీతో తెలుగులో నటుడిగా గుర్తింపు ఇచ్చారు. 
 
కానీ ఎన్ని చేసినా.. ఇంకా వెలితితగానే వుందంటూ... సరైన పాత్ర ఇస్తే మరింత ప్రూవ్‌ చేసుకుంటానని చెబుతున్నాడు. ఇంత కెరీర్‌ వున్న నటుడే ఇలా అడుగుతుంటే.. కొత్తగా వచ్చేవారిని ఎవరిని పట్టించుకుంటారంటూ ఇన్‌డైరెక్ట్‌గా తెలియజేస్తున్నాడన్నమాట. ఇదిలా వుంటే... ఈ రోజు సాయికుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వెబ్‌దునియా శుభాకాంక్షలు

Share this Story:

Follow Webdunia telugu