Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ తేజ్‌ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడానుః శ్రీ‌కాంత్‌

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:50 IST)
Srikanth- Sai tej
సాయి ధరమ్ తేజ్ చాలా మంచివాడు. మేమంతా కలిసి క్రికెట్  ఆడేవాళ్లం. విదేశాల్లో టూర్లు కూడా వేశాం. త‌ను బైక్ ప్ర‌మాదం బారిన ప‌డ‌డం దుర‌దృష్ట‌క‌రం. బైక్ ప్రమాదాలు అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. సాయి ధరమ్ తేజ్ ఆసుప‌త్రిలో క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడాను. ఇంకా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన చిత్రం `రిపబ్లిక్` పెద్ద హిట్ కావాలి. మంచి బూస్టప్ ఇవ్వాలి అంటూ హీరో శ్రీ‌కాంత్ చెప్పారు.
 
బైక్ రైడింగ్ గురించి చెబుతూ, నాకు బైక్ రైడింగ్‌లంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాడిని. మద్రాస్ నుంచి హైద్రాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాడిని. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో భద్రత దృష్ట్యా బైక్‌లను పక్కన పెట్టేశాను. కానీ మళ్లీ ఇలా బైక్ రైడింగ్ చేయడం ఆనందంగా అనిపించింది అని చెప్పారు. ఆయ‌న న‌టించిన `ఇదే మా కథ’  సినిమా కూడా బైక్ రైడింగ్ నేప‌థ్యంలో సాగుతంది. ఇందులో నా సీన్ లేకపోయినా కూడా బైక్ ఎక్కి తిరిగేవాడిని. చేతులు వదిలేసి మరీ నడిపేవాడిని. అలా రోడ్డు మీద డిఫరెంట్ లొకేషన్స్‌ను చూసుకుంటూ వెళ్లడం ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments