చిరంజీవి అప్పుడే హీరోగా అడుగులు వేస్తున్నాడు. విలన్ షేడ్ వున్న పాత్ర చేసి ఆ తర్వాత చిత్రంగా మారిన వ్యక్తి కథతో రూపొందిన సినిమా `న్యాయం కావాలి`. ఈ సినిమా 1981 మే 15న విడుదలైంది. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా.ఇప్పటికి 40 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఇందులో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయి. మోసం చేసిన అబ్బాయిపై న్యాయ పోరాటం చేసి ఎటువంటి విజయాన్ని సాధించింది? అన్నది కథ. ఇది నవలా రచయిత్రి కామేశ్వరి రచించిన కొత్తమలుపు ఆధారంగా తెరకెక్కిన సినిమా.ఈ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది.
ఇలాంటి కథ ఇప్పటికీ తగినదేనని ఎ. కోదండరామిరెడ్డి తెలియజేస్తున్నాడు. అప్పట్లో విజయవాడ థియేటర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య చూశాను. ఇదేదో కొత్తగా వుందని ప్రేక్షకులు అనుకోవడంతో సక్సెస్ సాధించానని ఆనంద పడ్డాను. అలా వేసిన అడుగు 23 సినిమా వరకు చిరంజీవితో ప్రయాణం సాగింది. కోదండరామిరెడ్డి, చిరు కాంబినేషన్ అంటే పెద్ద హిట్ అనే టాక్ వుండేదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో శతదినోత్సవ వేడుకలో దాసరి మాట్లాడుతూ, కొత్త కోణంలో సినిమాను తీశారని దర్శకుడిని అభినందించారు. ఈ సినిమాను తమిళ, కన్నడలోనూ రీమేక్ చేశారు. అక్కడా విజయం సాధించింది.