4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

దేవీ
మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (18:20 IST)
Rajeev kanakala, mouli
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. 
 
హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన "లిటిల్ హార్ట్స్" సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి 4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. చిన్న చిత్రాల్లో ఈ రేంజ్ వసూళ్లు రావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ చూస్తే ఫస్ట్ వీక్ మరిన్ని గ్రేట్ నెంబర్స్ "లిటిల్ హార్ట్స్" క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ,  సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని ప్రూవ్ అయ్యింది. కాలం మారింది, మనం కూడా మారకపోతే ఎవరినో నిందిస్తూ బతకాలి, "లిటిల్ హార్ట్స్" బ్యూటిఫుల్ ఫిలిం, ఒక్క 5 నిమిషాలు కూడా మన మొహం మీద చిరునవ్వు పక్కికి పోదు. మార్తాండ్ సాయి, ఆదిత్య హాసన్, సింజిత్, మౌళికి నా ప్రశంసలు. ప్రతి రెండేళ్లకో, మూడేళ్లకో ఎవడో వచ్చి ఇలా బాక్సాఫీస్ లు బద్దలుకొట్టి పోతుంటాడు, మనకు బుద్ధి రాదు, అంతే..' అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments