Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌పోజింగ్ చేస్తే నన్ను లేపుకెళ్లిపోతారు : లావణ్య త్రిపాఠి

తొలి సినిమా 'అందాల రాక్షసి'గా అలరించి 'భలే భలే మగాడివోయ్'తో మురిపించి, 'సోగ్గాడే చిన్ని నాయన'తో చక్కలిగింతలు పెట్టిన లావణ్య త్రిపాఠి 'శ్రీరస్తు శుభమస్తు' అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (10:51 IST)
తొలి సినిమా 'అందాల రాక్షసి'గా అలరించి 'భలే భలే మగాడివోయ్'తో మురిపించి, 'సోగ్గాడే చిన్ని నాయన'తో చక్కలిగింతలు పెట్టిన లావణ్య త్రిపాఠి 'శ్రీరస్తు శుభమస్తు' అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి చిత్రంలోనూ తన రూపలావణ్యాలతో అమితంగా ఆకర్షిస్తున్న ఈ భామ... తన సినీ కెరీర్‌పై స్పందించింది.
 
ప్రస్తుతం తాను చేస్తున్న తాజా చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఇందులో నేను చేసిన తెలుగు సినిమాలన్నింటికన్నా భిన్నమైన క్యారెక్టర్‌ చేస్తున్నాను. తలపొగరు అమ్మాయిగా కనపడతాను. నా క్యారెక్టర్‌ గురించి నేను చెప్పుకోవడం కన్నా వెండితెరమీద చూస్తేనే బాగుంటుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోందని చెప్పుకొచ్చింది. 
 
ముఖ్యంగా గ్లామర్‌ క్యారెక్టర్లు చేయనని ఎప్పుడూ చెప్పలేదన్నారు. అయితే, సినిమాకి అవసరమైనంత వరకూ గ్లామర్‌గా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్లలో మరీ గ్లామర్‌గా కనిపించాల్సిన అవసరం రాలేదు. గ్లామర్‌ రోల్స్‌ వస్తే తప్పకుండా చేస్తాను. అలాగే, ఎక్స్‌పోజింగ్‌ చేయనని నేనెప్పుడూ చెప్పలేదన్నారు. 
 
గ్లామర్‌ పేరుతో చిట్టిపొట్టి డ్రస్‌లు వేసుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా అందాలు ప్రదర్శించడం నాకు ఇష్టం ఉండదు. మా ఫ్యామిలీ ఎప్పుడన్నా ఒకసారి నా సినిమాలు చూస్తారు. అలాంటి సమయంలో నేను ఎక్స్‌పోజింగ్‌ చేసిన సన్నివేశాలు చూస్తే వెంటనే సినిమాలు మాన్పించేసి వెనక్కి తీసుకెళ్ళిపోతారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments