Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలియానాలోని బెస్ట్ ఫీచరేంటి.. ఆమే చెప్తోంది.. తెలుసుకోండి మరి..!

ఇలియానాలోని బెస్ట్ ఫీచరేంటి.. ఆమే చెప్తోంది.. తెలుసుకోండి మరి..!
, శనివారం, 3 అక్టోబరు 2015 (12:46 IST)
బాలీవుడ్‌లో బాగా ఫేమస్ అయిపోయిన ఇలియానా సెక్స్‌పై కూడా ఇటీవల సెన్సేషనల్ కామెంట్ చేసి వార్తల్లొ నిలిచింది. సెన్సేషనల్ కామెంట్స్ చేసేందుకు సైతం వెనుకాడని ఇలియానా ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో పాటు హీరోయిన్ అవ్వాలనే కసి ఎందుకు పెరిగిందో చెప్పేసింది. అసలు తనకు హీరోయిన్ అయ్యే లక్షణాలే లేవని ఇలియానాని అనే సరికి ఆమె ఎలాగైనా హీరోయిన్ కావాల్సిందేనని డిసైడైపోయిందట. 
 
సాధారణంగా హీరోయిన్లకు ఎద భాగమే కీలకమనీ కానీ తన బాడీ సరైన కొలతల్లో లేదని చాలామంది తనతో చెప్పారని ఇలియానా వెల్లడించింది. తొలినాళ్లల్లో సినిమాలంటే అంతగా ఇష్టపడేదాన్ని కాదని.. అందుకే అలాంటి కామెంట్స్‌ను లైట్‌గా తీసుకోనని ఇలియానా చెప్పింది. కానీ కొంతకాలం తర్వాత ఆ మాటలే తనలో కసిని రగిలించాయని తెలిపింది. 
 
ఇలా ఎంత కష్టమనిపించినా ఒక్కో అడుగు ముందుకేసి స్టార్ని అయిపోయానని ఇలియానా గర్వంగా చెప్పుకొచ్చింది. ఇక తన ఫీచర్స్ గురించి మాట్లాడినవాళ్లు ముక్కున వేలేసుకొనేలా.. ఆ ఫీచర్స్‌‌తోనే పైకి ఎదిగానని ఆమె స్పష్టం చేసింది. ముఖ్యంగా తన నడుమును చూసే ప్రేక్షకులు పడిపోయారని తనకున్న బెస్ట్ ఫీచర్స్‌లో అదొకటని ఇలియానా చెప్పిందట. నిజంగానే ఇలియానా నడుము గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో కూడా చాలామంది దర్శకులు ఇలియానా నడుముపైనే కాన్సంట్రేట్ చేస్తూ సాంగ్స్ తీసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu