Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ గ్యాంగ్‌లో ఓ మంచి కుర్రోడు ఉంటే.. జులై 8న 100 థియేట‌ర్ల‌లో 'ఇద్దరం'

జావ‌న్ అండ్ కాస్పియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'ఇద్ద‌రం'. సంజీవ్, సాయికృప హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాక‌ర్ వినుకొండ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు.

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (13:21 IST)
జావ‌న్ అండ్ కాస్పియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'ఇద్ద‌రం'. సంజీవ్, సాయికృప హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాక‌ర్ వినుకొండ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. జులై 8న సుమారు 100 థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా తెలిపేందుకు చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో స‌మావేశ‌మైంది.
 
ఈ సందర్భంగా సుధాక‌ర్ వినుకొండ మాట్లాడుతూ.. రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించాం. గ్యాంగ్ రేప్ నేప‌థ్యంలో సినిమా జ‌రుగుతుంది. రేప్ చేసే గ్యాంగ్‌లో ఒక‌డు మంచి వ్య‌క్తి ఉంటే, అత‌ను మిగిలిన వారిని ఎదిరిస్తే అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తిక‌ర‌మైన అంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించాం. మొత్తం ఆరు పాట‌లున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది.. అని చెప్పారు. 
 
టైమ్ నాని మాట్లాడుతూ, రైట‌ర్‌గా ఇది నాకు తొలి సినిమా. అంద‌రూ క‌లిసి బాగా ప‌నిచేశారు. అంద‌రికీ పేరొస్తుందన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత కిర‌ణ్ మాట్లాడుతూ, నేను ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు 'ఇద్ద‌రం' అయ్యాం. పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జులై 8న రంజాన్ శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల‌లో సుమారు 100 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం.. అని అన్నారు. 
 
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సంజీవ్, హీరోయిన్ సాయి కృపలు తమకు ఈ ఆవకాశం రావడం పట్ల సంతోషాన్ని తెలియచేశారు. రంగ‌నాథ్‌, జీవా, సూర్య‌, కౌటిల్య‌, బ్యాంక్ శ్రీనివాస్‌, ప్ర‌భావ‌తి, జ‌బర్ద‌స్త్ బాష ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: సుధాక‌ర్ వినుకొండ‌, స‌హ నిర్మాత‌లు: శివ‌దీప్ స్వామి, గంగిరెడ్డి, కెమెరా: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, సంగీతం: కిర‌ణ్ శంక‌ర్‌, మాట‌లు: టైమ్ నాని, ఎడిట‌ర్‌: నాగేంద్ర‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిర‌ణ్ సిరిగిరి, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: శ‌ర్మ ఎం.కె.వి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం