Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలిఫోర్నియాలో బాలయ్య బర్త్ డే పార్టీ.. చిందులేయనున్న హంసానందిని?!

Advertiesment
Hamsa Nandi dance in balakrishna birth day party
, సోమవారం, 23 మే 2016 (12:33 IST)
నందమూరి హీరో బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) వేడుకల్ని అమెరికా జరుపుకోనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా, విభిన్నంగా నిర్వహించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా బాలయ్యకు కాలిఫోర్నియాలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో గ్రాండ్‌గా పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు టాక్. 
 
ఇందుకోసం వెరైటీగా హంసానందినితో డాన్స్ షో ఏర్పాటు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేగాకుండా బాలకృష్ణ బర్త్ డే పార్టీ ద్వారా వచ్చే డబ్బును బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్తున్నారు.
 
పనిలోపనిగా ఈ పార్టీలో తన 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్‌ కూడా బాలకృష్ణ రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఇకపోతే.. హంసానందిని ఐటమ్ సాంగ్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్‌లో బిజీ బిజీ అయ్యింది. అయితే ఏ హీరోతో హంసానందిని స్టెప్పులేయనుందనే విషయం గురించి తెలుసుకోవాలంటే.. కాస్త వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బట్టలు ఉతుకుతున్నారని చెప్తే బాగుండదని..?