''గురు'' ట్రైలర్ రిలీజ్.. బర్త్ డేను పురస్కరించుకుని ఓ మ్యూజిక్ బిట్లో వెంకీ డ్యాన్స్ (వీడియో)
విక్టరీ వెంకటేష్ తాజా సినిమా గురు ఫస్ట్ లుక్ విడుదలైంది. బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం సాలాఖద్దూస్ రీమేక్‌గా తెరకెక్కుతున్న గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాన
విక్టరీ వెంకటేష్ తాజా సినిమా గురు ఫస్ట్ లుక్ విడుదలైంది. బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం సాలాఖద్దూస్ రీమేక్‌గా తెరకెక్కుతున్న గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం వెంకటేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురు అభిమానుల కోసం ఓ ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
సినిమా థీంను, కాన్సెప్ట్‌ను ఏమాత్రం రివీల్ చేయకుండా కేవలం అభిమానుల కోసమే అన్నట్టుగా టీజర్‌ను రూపొందించారు. చిన్న మ్యూజిక్ బిట్‌కు వెంకీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు ఆడియో రిలీజ్ డేట్లను ప్రకటించనున్నారు.
తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన సుధ కొంగర తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తుండగా హింది తమిళంలో లీడ్ రోల్ చేసిన రితిక సింగ్ కూడా గురులో నటిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలను పెంచేసిన వెంకటేష్.. ఓ మ్యూజిక్ బిట్ టీజర్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. టీజర్‌ను మీరూ ఓ లుక్కేయండి.