Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23న ఎరోటిక్ సస్పెన్స్‌ థ్రిల్లర్ 'రెడ్'

కన్నడంలో ఘన విజయం సాధించిన 'రెడ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాక

Advertiesment
Erotic suspense thriller Red
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:17 IST)
కన్నడంలో ఘన విజయం సాధించిన 'రెడ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య.. ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది. ఈ చిత్ర విశేషాలపై నిర్మాత భరత్‌ మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి.. ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. 
 
ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ.. ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ 'రెడ్'. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్‌తో పాటు అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లితెర సీరియల్‌లో అమితాబ్... కేదర్‌నాథ్ ఆలయ ప్రత్యేకతే ప్రధానాంశంగా సీరియల్