Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీహరి మృతికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణం: శాంతి ఆవేదన

Advertiesment
Disco Shanti Reveals About Srihari Death
, మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (12:47 IST)
టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి మృతికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని ఆయన సతీమణి శాంతి ఆవేదనతో వెల్లడించారు. 2013 అక్టోబర్ 9న శ్రీహరి మరణించిన నేపథ్యంలో.. ఆయన మృతికి ముంబై లీలావతి ఆసుపత్రి వారే కారణమని ఆరోపించారు. జాండీస్‌తో ఉన్న ఆయన కొద్ది రోజులుగా మందులు వాడుతున్నారని.. అయితే అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శ్రీహరి ప్రాణాలు కోల్పోయారని ఆమె విమర్శించారు. అధిక రక్తస్రావం కావడంతో ఆయన్ను కాపాడుకోలేకపోయామని తెలిపారు.
 
కాగా.. వెండితెర మీద తన కంటూ రియల్ స్టార్‌గా ఓ సెపరేట్ మార్క్ ఉంచుకున్న శ్రీహరి.. ఆన్ స్క్రీన్ మీదనే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలను చేశారు. ఇప్పుడేదో కొత్తగా చేస్తున్న ఊరిని బాగు చేసే కార్యక్రమం శ్రీహరి కొన్నేళ్ల క్రితమే మొదలు పెట్టడం గమనార్హం. 
 
ఇక శ్రీహరి లేని జీవితం కష్టంగా ఉన్నా నిరంతరం ఆయన జ్ఞాపకాలతోనే జీవితాన్ని గడుపుతున్న అంటూ శాంతి ఆవేదన చెందారు. ఆరోజు శ్రీహరికి సరైన చికిత్స అందివుంటే.. ఆయన బతికివుండేవారని చెప్తోంది.

Share this Story:

Follow Webdunia telugu