Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ రేటు ఇంతా.. వింటూనే బ్రాండ్ కంపెనీలు పరార్

నిస్సందేహంగా భారతదేశంలోనే ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ఎవరంటే ప్రభాస్ అనే చెప్పాలి. ఒక్క సినిమా బాహుబలి తన కెరీర్‌ని, తన ప్రాచుర్యాన్ని, స్టార్‌డమ్‌ను మార్చిపడేసింది. ఇప్పుడు ప్రభాస్ ఎంత జాతీయ స్టార్ అయిపోయాడంటే మహా మహా బాలీవుడ్ స్టార్లు, క్ర

ప్రభాస్ రేటు ఇంతా.. వింటూనే బ్రాండ్ కంపెనీలు పరార్
హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (04:31 IST)
నిస్సందేహంగా భారతదేశంలోనే ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ఎవరంటే ప్రభాస్ అనే చెప్పాలి. ఒక్క సినిమా బాహుబలి తన కెరీర్‌ని, తన ప్రాచుర్యాన్ని, స్టార్‌డమ్‌ను మార్చిపడేసింది. ఇప్పుడు ప్రభాస్ ఎంత జాతీయ స్టార్ అయిపోయాడంటే మహా మహా బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లకు లేని క్రేజీ ఆ మూడక్షరాల పేరుకు వచ్చేసింది. ఇప్పుడు ఆ పేరు వెనుక రూపొందిన బ్రాండ్ వాల్యూను తెలుసుకుంటూంటే మార్కెట్‌కు షాక్ తగులుతోంది.
 
కారణం. చిన్నదే. కాని అది కలిగించే షాక్ చాలా పెద్దది. బాహుబలి పుణ్యమా అని తనకు ఏర్పడిన బ్రాండ్ విలువను పూర్తిస్థాయిలో వాడుకోవాలని ప్రభాస్ భావించడమే అందరికీ షాక్ కలిగిస్తోంది. ఏ కంపెనీ అయినా తనను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవాలంటే ప్రభాస్ పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని వార్త. ఇది ప్రస్తుతం స్టార్‌లకున్న మార్కెట్ రేంజ్‌కి డబుల్ రేట్ అట. దేశంలో పేరొందిన క్రికెట్ స్టార్లు, బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఎంత పెద్ద కంపెనీకైనాసరే బ్రాండ్ అంబాసిడర్లు కావాలంటే నాలుగు లేదా అయిదు కోట్ల రూపాయలను డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. 
 
బాహుబలి 2 ఏప్రిల్ 28న విడుదల కానున్నందున, ఈ సినిమా చుట్టూ తయారైన క్రేజీని, హైప్‌ని దృష్టిలో పెట్టుకుని సొమ్ము చేసుకోవాలని బ్రాండ్ కంపెనీలు పరుగులు పెడుతూ ప్రభాస్ ముందు వాలిపోతున్నాయి. కానీ బాహుబలి 2 విడుదల తర్వాత తన పాపులారిటీ ఏ రేంజిలో పెరగనుందో బాగా గ్రహించిన ప్రభాస్ దానికి అనుగుణంగానే తన బ్రాండ్ విలువను పెంచాలని డిసైడ్ అయిపోయాడు. 
 
కాని ఒక బ్రాండ్ కుదుర్చుకోవాలంటే కనీసం పది కోట్లు ఇవ్వాలని ప్రభాస్ చెబుతున్న రేటు వినగానే చర్చలకు కూడా తావీయకుండా కంపెనీలు పారిపోతున్నాయని వార్తలు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకిన్ ఇండియాను చేసి చూపిన రజనీ.. మోదీ మాట మన్నించినట్లేనా?