Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డును బాదిపడేసిన బాహుబలి-2: రెండురోజుల్లో 56 కోట్లు

ఒక తెలుగు సినిమా విదేశాల్లో ఇంతటి ప్రభంజనం సృష్టించడం సినిమా చరిత్రలో కనీవిని ఎరుగం. ఇతర సినిమాలతో పోలిక వద్దు. బాహుబలి ది బిగినింగ్ మొత్తం అమెరికన్ కలెక్షన్లను బాహుబలి ది కంక్లూజన్ కేవలం రెండు రోజుల్లో బీట్ చేసిందంటే నమ్మశక్యం కావడం లేదు. కానీ ఇది న

అమెరికాలో తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డును బాదిపడేసిన బాహుబలి-2: రెండురోజుల్లో 56 కోట్లు
హైదరాబాద్ , సోమవారం, 1 మే 2017 (08:10 IST)
ఒక తెలుగు సినిమా విదేశాల్లో ఇంతటి ప్రభంజనం సృష్టించడం సినిమా చరిత్రలో కనీవిని ఎరుగం. ఇతర సినిమాలతో పోలిక వద్దు. బాహుబలి ది బిగినింగ్ మొత్తం అమెరికన్ కలెక్షన్లను బాహుబలి ది కంక్లూజన్ కేవలం రెండు రోజుల్లో బీట్ చేసిందంటే నమ్మశక్యం కావడం లేదు. కానీ ఇది నిజం. ఈ లెక్కన మరో రెండు ోజుల్లో అమెరికాలో టాప్ 10లో ఉన్న ఇతర తెలుగు సినిమాల ఓవరాల్ కలెక్షన్లను బాహుబలి 2 సునాయాసంగా అధిగమించేలా ఉందని వార్తలు.
 
'టాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ.. బాహుబ‌లి మానియాకు ప్రాంత బేధం లేకుండా అయింది. ఓవ‌ర్సీస్ లోనూ రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. బాహుబ‌లి దెబ్బ‌కు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, ర‌జనీ కాంత్ రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం ఇదే తొలిసార‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
 
విడుద‌ల‌యిన ప్ర‌తీ చోటా త‌న‌దైన మార్కుతో స‌రికొత్త చ‌రిత్రను న‌మోదు చేస్తున్న బాహుబ‌లి-2.. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు తిర‌గ‌రాస్తోంది. అమెరికాలో రెండు రోజుల్లోనే 8మిలియ‌న్ డాల‌ర్ల‌ను క‌లెక్ట్ చేసినట్లు అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్లు చెబుతున్నారు. ఇది బాహుబలి-1 ఓవ‌రాల్ క‌లెక్ష‌న్ల కంటే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.  ఈ సినిమా రాక‌తో, రెండు రోజుల క‌లెక్ష‌న్ల‌తో టాప్-10 తెలుగు సినిమాల లిస్ట్ ఒక్క‌సారిగా మారిపోయింది. అమెరికాలో క‌లెక్ష‌న్ల ప‌రంగా టాప్-10 తెలుగు సినిమాల వివ‌రాలు ఇలా మారిపోయాయి. 
 
1. బాహుబ‌లి-2: 8 మిలియ‌న్ డాలర్లు (56 కోట్ల రూపాయ‌లు.. రెండురోజుల్లోనే)
2. బాహుబ‌లి-1: 7.51 మిలియ‌న్ డాల‌ర్లు (52.59 కోట్ల రూపాయ‌లు)
3. శ్రీమంతుడుః 2.89 మిలియ‌న్ డాల‌ర్లు (20.23  కోట్ల రూపాయ‌లు)
4. అ.. ఆ: 2.45 మిలియ‌న్ డాల‌ర్లు (17.15  కోట్ల రూపాయ‌లు)
5. ఖైదీ నెం.150: 2.45 మిలియ‌న్ డాల‌ర్లు (17.15  కోట్ల రూపాయ‌లు)
6. నాన్న‌కు ప్రేమ‌తోః 2.02 మిలియ‌న్ డాల‌ర్లు (14.14  కోట్ల రూపాయ‌లు)
7. అత్తారింటికి దారేదిః 1.90 మిలియ‌న్ డాల‌ర్లు (13.30  కోట్ల రూపాయ‌లు)
8.జ‌న‌తాగ్యారేజ్ః 1.80 మిలియ‌న్ డాల‌ర్లు (12.60  కోట్ల రూపాయ‌లు)
9. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిః 1.66 మిలియ‌న్ డాల‌ర్లు (11.62  కోట్ల రూపాయ‌లు)
10. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుః 1.64 మిలియ‌న్ డాల‌ర్లు (11.48  కోట్ల రూపాయ‌లు)
 
మహాశ్చర్యమైన విషయం ఏమిటంటే.. ఉత్తరాదిలో బాహుబలి-2ని ప్రమోట్ చేసిన ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా విజయాన్ని చూసి దండం పెట్టేశాడు. సినిమాను సినిమాకు పని చేసిన యూనిట్ సభ్యులను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇందులో భాగంగా.. రాజమౌళితో కలిసి దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కరణ్ ' దశాబ్దపు టాప్ డైరెక్టర్‌తో నేను. ఈ జీనియస్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా... అంటూ ట్వీట్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2 భారత్ నుంచి వచ్చిన అవతార్: ఆకాశానికెత్తిన వర్మ