Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క నిశ్శ‌బ్దం పోస్ట‌ర్ ఏం చెబుతుంది..? ఇంత‌కీ సినిమా ఎలా ఉండ‌బోతుంది..?

అనుష్క నిశ్శ‌బ్దం పోస్ట‌ర్ ఏం చెబుతుంది..? ఇంత‌కీ సినిమా ఎలా ఉండ‌బోతుంది..?
, సోమవారం, 22 జులై 2019 (14:06 IST)
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ‌స్ట్ క్రాస్ ఓవ‌ర్ ఫిల్మ్ నిశ్శ‌బ్దం. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. అనుష్క శెట్టి న‌టిగా 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిశ్శబ్దం టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌చేసారు. 
 
సీయోట్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తైంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్‌లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
నిశ్శ‌బ్ధం పోస్ట‌ర్లో అనుష్క ఫోటో కాకుండా.. చేతి వేళ్ల‌ను మాత్ర‌మే చూపించారు. ఆ వేళ్లు చూపించిన విధానం బ‌ట్టి.. అనుష్క ఇందులో చెవిటి, మూగ పాత్ర‌ను పోషిస్తుంద‌ని తెలుస్తుంది. ఈ పోస్టర్ ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. మ‌రి.. సినిమా ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమో