Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ కు సిక్స్ ప్యాక్ హీరో బంపర్ షాక్...

పవన్ కళ్యాణ్ కు సిక్స్ ప్యాక్ హీరో బంపర్ షాక్...
, సోమవారం, 27 అక్టోబరు 2014 (16:51 IST)
బాలీవుడ్ హీరోల్లో షారుక్ ఖాన్ తనది సెపరేట్ రేంజ్ అని మరోసారి తన చిత్రం హేపీ న్యూ ఇయర్ తో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టే దిశగా సాగుతోంది. ఈ సందర్భంగా షారుక్ ను ఓ ప్రముఖ తెలుగు పత్రిక కదిలించింది. ముఖ్యంగా తన వయసు గురించి అడిగితే... తనకు వయసు పైబడుతోందన్న ఆలోచన లేనే లేదని తేల్చి చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 
 
అంతేకాదు... మీరు తెలుగులో పవన్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నటిస్తారని అంటున్నారే అని అడిగితే... అసలు పవన్ చిత్రం అత్తారింటికి దారేదిని ఇంతవరకూ చూడలేదని స్పష్టం చేశారు. అసలు తనకు ఆ సినిమాను చూసే తీరిక లేదని కూడా వెల్లడించాడు. దీంతో షారుక్ ఆ చిత్రం చేయబోవడంలేదని కామెంట్లకు బలాన్ని చేకూర్చినట్లయింది. 
 
ఇదిలావుంటే తమిళ డైరెక్టర్ శంకర్ తీస్తున్న ఐ చిత్రంపైన మాత్రం షారుక్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ చిత్రం ఎపుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu