Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రణీతపై త్రివిక్రమ్ సీరియస్... 'అత్తారింటికి...' పిల్ల స్పాట్ నుంచి తుర్రోతుర్రు

ప్రణీతపై త్రివిక్రమ్ సీరియస్... 'అత్తారింటికి...' పిల్ల స్పాట్ నుంచి తుర్రోతుర్రు
, గురువారం, 30 అక్టోబరు 2014 (17:36 IST)
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీతకు ఛాన్స్ ఇచ్చి ఆమెకో లిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ అవమానపరిచాడట. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. 
 
సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన సన్నివేశంలో ఆమె ఎలాంటి దుస్తులు వేసుకురావాలో అనే విషయాన్ని ముందుగానే వెల్లడించాడట. ఐతే ప్రణీత మాత్రం త్రివిక్రమ్ చెప్పినట్లు కాకుండా ఆమె ఇష్టప్రకారం దుస్తులు వేసుకుని వచ్చిందట. దీంతో ఆమెపై త్రివిక్రమ్ కు చెప్పలేనంత కోపం వచ్చిందట. 
 
చెడమడా అరిచేసరికి ఆమె ఆ సీన్ లో నటించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. కాగా ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను నటింపజేస్తున్నట్లు సమాచారం. ‘అత్తారింటికి దారేది’తో ఆమెకు సూపర్ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్ చెప్పినట్లు వినకుండా ప్రణీత ఇలా ఎందుకు చేసిందబ్బా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu