Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య స్నేహితుడిపై చేజేసుకున్నాడా? మహిళను మందలించాడా? ఏం జరిగింది..? కేసెందుకు?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (12:21 IST)
తమిళ స్టార్ హీరో సూర్యపై ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ కేసు పెట్టాడు. అసలు విషయాని కొస్తే టీనగర్లో ఓ బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్న లెనిన్ ఇమాన్యుయెల్ (25) అనే వ్యక్తి తన స్నేహితుడు, చెన్నై ఫుట్‌బాల్ అసోసియేషన్ (సీఎఫ్ఏ) టీంలో ప్రముఖ క్రీడాకారుడు ప్రేమ్ కుమార్ (21)తో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు అడయార్ ప్రాంతం మీదుగా వెళుతున్నాడు. కాగా ఆ సమయంలోనే అటువైపు ఓ కారు వేగంగా వచ్చి వెంటనే బ్రేక్ వేసింది. దీంతో బైక్ నడుపుతున్న వారు కారును బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కానీ ఆ కారు నడిపింది ఓ మహిళ. దీంతో కారు నిర్లక్ష్యంగా నడపడమే కాకుండా బైక్‌ని ధ్వంసం చేశారని, తమకు గాయాలవ్వడానికి కారణమైన ఆమెని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. 
 
అదేసమయంలో అటువైపుగా హీరో సూర్య వచ్చారు. వారు మహిళను వేధిస్తుంటే గమనించిన సూర్య ఆ యువకులను తిట్టడమే కాకుండా, ఫుట్‌బాల్ ఆటగాడైన తన స్నేహితుడిపై చేయి చేసుకున్నాడని లెనిన్ పేర్కొన్నాడు. అయితే సూర్య మేనేజర్ మాత్రం ఆయన ఎవరి మీద చెయ్యి చేసుకోలేదని, మహిళతో పద్ధతిగా నడుచుకోవాలని ఆ యువకులను హెచ్చరించారని చెప్పారు. ట్రాఫిక్ కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో గొడవని విరమించుకొని చెప్పి సూర్య అక్కడ నుండి వెళ్లిపోయినట్లు తెలియజేసారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments