Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటరి జీవితం వద్దు బాబోయ్.. మళ్లీ పెళ్లి చేసుకుంటా.. నటి జీనత్!

ఒంటరి జీవితం వద్దు బాబోయ్.. మళ్లీ పెళ్లి చేసుకుంటా.. నటి జీనత్!
, గురువారం, 20 నవంబరు 2014 (11:48 IST)
ఒంటరి జీవితం వద్దు బాబోయ్.. మళ్లీ పెళ్లి చేసుకుంటా.. అంటోంది బాలీవుడ్ నటి జీనత్ అమన్. డబ్బయ్యవ దశకంలో తన సెక్సీ నటనతో యువతను కైపెక్కించిన జీనత్ 64వ ఏట అడుగుపెట్టింది. 
 
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. "ఇప్పుడు నా కొడుకులిద్దరూ పెద్దాళ్లయి వారి వారి జీవితాలలో స్థిరపడ్డారు. దాంతో నేను ఒంటరి నయ్యాను. అందుకే, ఇప్పుడు నా జీవితం గురించి ఆలోచించుకోవాలి. మరోసారి పెళ్లి చేసుకోవాలని వుంది. అందులో తప్పేమీ లేదు కదా?" అంటూ ప్రశ్నించింది.
 
దర్శక నిర్మాత సంజయ్ ఖాన్‌తో చాలా కాలం కలసి జీవించిన జీనత్, 1985లో నటుడు, దర్శకనిర్మాత మజర్ ఖాన్‌ను వివాహమాడింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం భర్తతో విభేదాలు తలెత్తడంతో ఆయనకు విడాకులిచ్చింది. తర్వాత మజాల్ అనారోగ్యంతో మరణించాడు.
 
అప్పటి నుంచి పిల్లల్ని పెంచిన జీనత్.. ప్రస్తుతం పిల్లలు వారి లైఫ్‌లో సెటిల్ కావడంతో.. ఒంటిరిదైపోయింది.. దీంతో కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. మరి జీనత్‌కు ఎవరు సపోర్ట్ ఇస్తారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu