Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామెడీకి మనోళ్ళు లేరా...? శ్రీను వైట్ల అలా డిసైడ్ అయ్యాడా...?

కామెడీకి మనోళ్ళు లేరా...? శ్రీను వైట్ల అలా డిసైడ్ అయ్యాడా...?
, గురువారం, 22 జనవరి 2015 (21:01 IST)
కామెడీ సన్నివేశాల్లో నటించాలంటే బ్రహ్మానందాన్ని ఎక్కువగా తీసుకుంటారు దర్శకులు. కానీ బ్రహ్మానందం అందరికీ అందనివాడిగా తయారయ్యాడు. చిన్న చిత్రాలకు దొరకడు. పెద్ద చిత్రాలకు డేట్స్‌ తినేస్తాడట. ఏదిఏమైనా శ్రీను వైట్ల ఆయన్ను కంట్రోల్‌ చేసినట్లు ఎవ్వరూ చేయలేకపోయారు. 
 
ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే సినిమా లేదు. కానీ శ్రీనువైట్ల కొన్ని కారణాల వల్ల బ్రహ్మిని తీసుకోవడంలేదు. తాజాగా ఓ చిత్రాన్ని శ్రీను వైట్ల చేస్తున్నాడు. ఇందుకు ప్రధానమైన కామెడీగా శ్రీనివాసరెడ్డిని తీసుకుందామని అనుకున్నా.. బ్రహ్మానందంతో సరితూగడు.
 
అందుకే పలు రకాలుగా ఆలోచించి ఎవర్ని తీసుకున్నా కాంట్రవర్సీ అవుతుందని.. ఏకంగా తమిళ కమేడియన్‌ను తెచ్చే ఆలోచనలో వున్నట్లు సమాచారం. త్వరలో అన్ని వివరాలు తెలియనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu