సూపర్‌స్టార్ రజనీకాంత్ డాన్స్‌లు వేయనున్నారు. ముంబైకు చెందిన కొరియోగ్రాఫర్ సోబి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. రజనీకాంత్ గతంలో వేసిన స్టెప్లకు భిన్నంగా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. 18వ తేదీ నుంచి ఈనెల 22వరకు సాగే షూటింగ్లో అనుష్క, సోనాక్షి సిన్హాలు పాల్గొంటున్నారు. వీరితో రజనీ స్టెప్లు వేస్తున్నారు. ముంబైకు చెందిన 70 మంది డాన్సర్లు ఇందులో పాల్గొంటున్నారు.