దుడుకుగా ఉంటారని చెప్పుకునే టాలీవుడ్ సినీ నిర్మాత సి కళ్యాణ్‌పై మరో కేసు నమోదైంది. హైదరాబాద్‌లో ఓ మహిళా వైద్యురాలిని బెదిరించారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో గల ఓ ఫ్లాట్ విషయంలో గత కొద్దిరోజులుగా డాక్టర్ కవిత, సి.కళ్యాణ్ మధ్య వివాదం నెలకొంది. ఆఫ్లాట్ మార్గంలో మెట్రోరైలు వెళ్తున్న నేపథ్యంలో అపార్ట్మెంట్ కొంత మేరకు పోయే అవకాశం ఉంది, అందుకు జీహెచ్ఎంసీ పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది.
అయితే వచ్చే నగదును వ్యక్తిగతంగా కాకుండా ఫ్లాట్ఓనర్స్ అసోసియేషన్‌లో వేయమని సి.కళ్యాణ్ కోరగా, అందరికి వేరువేరుగా ఇవ్వాలని కవితతో పాటు మరో ఐదుగురు కోరారు. దీంతో వివాదం చెలరేగింది.
పైగా, కవితకు సంబంధించిన ఫ్లాట్‌ను కూడా తనకే అమ్మాలంటూ సి.కళ్యాణ్ బెదిరింపులకు దిగాడు. దీంతో కవిత జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో సి.కళ్యాణ్‌పై 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.