Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంది అవార్డుల పండగ 3చోట్ల... రాష్ట్ర విభజనతోనే ఈ కష్టం!

నంది అవార్డుల పండగ 3చోట్ల... రాష్ట్ర విభజనతోనే ఈ కష్టం!
, గురువారం, 22 జనవరి 2015 (12:09 IST)
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. ఏపీకి కష్టకాలం తప్పట్లేదు. సినిమారంగం గురించి ఆంధ్రప్రదేశ్ ఎవరినీ మంత్రిగా పెట్టిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వపరంగా ఓ మంత్రి వున్నారు. అయితే.. ఇప్పుడు టీవీ, సినిమా రంగాలకు ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డుల విషయంలో పెద్ద సమస్య వచ్చిపడింది. నంది అవార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఎప్పుడూ ఒకేచోట నిర్వహించే అవార్డు ప్రదానం ఈసారి మూడుచోట్ల నిర్వహించాలని చూస్తోంది.
 
విజయవాడలో ఉగాది నాడు, అనంతపురంలో నంది టీవీ అవార్డులను, రాజమండ్రిలో నంది థియేటర్‌ అవార్డులను ఇవ్వాలని ప్లాన్‌లో వుంది. అయితే అవార్డు ప్రైజ్‌ 2 లక్షలుగా వుండేది. కానీ ఇకనుంచి 50 వేలకు కుదించేశాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఎఫ్‌డిసి అధికారులు తగిన వివరణ ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వపరంగా ఆర్థిక వనరులు లేకపోవడంతో కుదించాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారు. 
 
కాగా, ఈ విషయంలో ఇండస్ట్రీలో పలు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు ప్రయాణాలకు, వివిధ కార్యక్రమాలకు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ.. కళాకారులను తక్కువగా చూస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. మరి ఎ.పి. ముఖ్యమంత్రి దీనిపై సరైన వివరణ త్వరలో ఇవ్వాల్సి వుంటుందని పలువురు నిర్మాతలు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu