Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్రిది సహజ మరణమే: ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడి..!

చక్రిది సహజ మరణమే: ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడి..!
, శుక్రవారం, 30 జనవరి 2015 (08:43 IST)
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మృతి విషయంలో నెలకొన్న మిస్టరీ వీడింది. ఆయన అస్థికల్లో ఎలాంటి విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా తెలియడంతో ఆయన మృతి సహజమైనదేనని తేలింది. టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి మరణానంతరం ఆయన భార్య శ్రావణి, కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పలు విధాలైన ఆరోపణలను చేసుకున్నారు.  
 
చక్రిపై విషప్రయోగం జరిగిందని, అందువల్లనే ఆయన మృతి చెందారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ స్థితిలో చక్రి అస్థికలను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించి పరిశీలించారు. అందులో ఎలాంటి విష పదార్థాల ఆనవాళ్లు లేవని వాళ్లు తేల్చారు. దాంతో చక్రిది సహజమరణమే తప్ప అందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పారు

Share this Story:

Follow Webdunia telugu