Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి డ్రెస్సింగ్ నచ్చదు! అయినా తప్పదు..!

అలాంటి డ్రెస్సింగ్ నచ్చదు! అయినా తప్పదు..!
, శుక్రవారం, 20 మార్చి 2015 (16:13 IST)
సినీ తారలు అంటేనే గ్రాండ్ లుక్. సినిమాల్లోనే కాకుండా ఇంటా, బయటా కూడా ఖరీదైన దుస్తులు, బరువైన బంగారు ఆభరణాలతో కనిపిస్తుంటారు. అయితే 'అందాల రాక్షసి' ఫేం లావణ్య త్రిపాఠీ మాత్రం తనకలాంటివి నచ్చవంటోంది. ఎప్పుడూ సింపిల్‌గా ఉండడమే ఇష్టమట. ఆడంబరంగా వుండే మోడరన్ కాస్ట్యూమ్స్ తనకు ఏమాత్రం సరిపడవని చెబుతోంది.

"సినిమాలో మనం పోషించే పాత్రకు తగ్గట్టుగానే దుస్తులు వుండాలి. ఇటీవల ఒక సినిమాలో నేను డాక్టర్ గా చేశాను. అందులో ఒక చోట ఆసుపత్రిలో తీస్తున్న ఓ సన్నివేశంలో నటించడానికి గాను ధగధగ మెరిసే, రిచ్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు. 'ఈ సీనులో అలాంటివి కాకుండా సింపుల్ డ్రెస్సింగే బాగుంటుందని' డైరెక్టర్ కి చెప్పాను. ఆయన కన్విన్స్ అయ్యారు. 
 
అంతేకాదు, నన్ను కాంప్లిమెంట్ కూడా చేశారు" అని చెప్పింది లావణ్య. అలాగే భారీ నగలు ధరించడమన్నా తనకు ఇష్టం వుండదని చెప్పింది. 'చెవులకు చిన్న చిన్న పోగులు, మెళ్ళో చిన్న గొలుసు వుంటే చాలు. అయినా కొన్ని సందర్భాలలో నచ్చకపోయినా తప్పక డ్రస్ చేయాల్సి వస్తుందని' అంటోంది ఈ అందాలతార. 

Share this Story:

Follow Webdunia telugu