గూగుల్ సెర్చ్ ఇంజన్ ప్రతి సంవత్సరం ఇండియాలో ఎవరి గురించి ఎక్కువగా నెటిజన్లు వెదికారు అనే వివరాలను ప్రకటిస్తూ ఉంటుంది. గత ఏడాదిలాగానే ఈ సారి కూడా జాబితాను గూగుల్ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది విస్తుపోయే విషయాలు వెళ్లడయ్యాయి. పోర్న్ స్టార్‌ను అత్యధిక భారతీయులు నెట్లో వెదికినట్లుగా తెలుస్తోంది.
ఒక్క సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసిన మోడీకి బాగా పబ్లిసిటీ లభించింది. అప్పుడు గూగుల్‌లో అత్యధికులు వెదికిన వ్యక్తిగా మోడీకి గుర్తింపు వచ్చింది.
అయితే సంవత్సరం మొత్తం మీద అన్నివిభాగాల నుండి చూసుకుంటే మోడీకి రెండవ స్థానమే దక్కింది. మొదటి స్థానంలో మాజీ పోర్న్‌స్టార్, తాజా బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ నిలిచింది. ఇక మూడవ స్థానంలో సల్మాన్, నాల్గవ స్థానంలో కత్రినా కైఫ్, అయిదవ స్థానంలో దీపికా పడుకునే లు నిలిచారు. దీన్ని బట్టి చూస్తే భారతీయ నెటిజన్లు సెక్సీ స్టార్కే అగ్రతాంబూలం ఇస్తున్నారనమాట.