Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంటపడితే 'పోరా' అనేస్తా! : సౌమ్య సుకుమార్

వెంటపడితే 'పోరా' అనేస్తా! : సౌమ్య సుకుమార్
, శనివారం, 5 జులై 2014 (18:58 IST)
'నేను చదివిన కాలేజీ, నివసించిన వాతావరణం అంతా అమ్మాయిల మధ్య అమ్మాయిలా తిరిగాను. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రలో నటించానని'' నటి సౌమ్య సుకుమార్‌ చెబుతున్నారు. కరణ్‌, సౌమ్య సుకుమార్‌ జంటగా పరిచయమవుతున్న చిత్రం 'పోరా పోవె'. ఎస్వీ మూవీమేకర్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ మింగమల, యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. లంకపల్లి శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ నెల 18న చిత్రం విడుదల కాబోతుంది. 
 
ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్‌, మనోజ్‌లు నటించిన 'వేదం' సినిమాలో మనోజ్‌ రాక్‌బ్యాండ్‌లో సభ్యురాలిగా నటించాను. ఆ సినిమా తర్వాత సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ దగ్గర పనిచేసిన జైపాల్‌రెడ్డి ద్వారా 'పోరా పోవే' సినిమాలో అవకాశం లభించింది.

చిత్ర టైటిల్‌కు తగినట్లే అల్లరి అమ్మాయిగా కన్పిస్తాను. అబ్బాయిలు వెంటపబడితే 'పోరా' అనేంత కోపం చూపిస్తా. నాకు సమానంగా హీరో పాత్ర ఉంటుంది. అమ్మాయిల మధ్య ఉండే అమ్మాయిగా కోపంకూడా ప్రదర్శిస్తాను. ఈ టైటిల్‌ ఇప్పటి యువత ఎక్కువగా వాడుకునేదే. 
 
ఇక 'వేదం' తమిళ రీమేక్‌ 'వానం'లో నటించాను. తర్వాత నేరుగా కథానాయికగా నటించిన చిత్రమిదే అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ... పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. లా వరకు చదివాను. అంతకుముందు జెసిబ్రదర్స్‌వంటి కొన్ని మోడల్‌ ప్రోగ్రామ్‌లో నటించాను. అని చెబుతూ... తెలుగులో అల్లు అర్జున్‌, మహేష్‌ అంటే ఇష్టమనీ, శ్రీదేవి, ఐశ్వర్యారాయ్‌ తరహాలో నటించాలని తెలిపాడు. నటనకు తన కుటుంబం నుంచి పూర్తి సహకారముందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu