Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంగోపాల్ వర్మ 'సరళా ఆంటీ' ఎవరేంటి.. ఆవిడే....

రాంగోపాల్ వర్మ 'సరళా ఆంటీ' ఎవరేంటి.. ఆవిడే....
, బుధవారం, 17 సెప్టెంబరు 2014 (19:30 IST)
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ప్రజల్లో చర్చ జరిగేలా చేయడమే ఈయన సినీమా టెక్నిక్. అదే పెద్ద పబ్లిసిటీ కూడా. సినిమా హిట్టు ఫ్లాపులతో నిమిత్తం లేకుండా చెత్త సినిమా తీసి కూడా కలెక్షన్లు రాబట్టడం ఆయనకే చెల్లింది. రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ గుర్తింపు ఉండేది. ఇప్పుడు అది ఒక్కసారిగా పడిపోయిందని అంటున్నారు. అతన్ని ఎవ్వరూ లెక్కచేయడంలేదట ఇండస్ట్రీలో. 
 
కొత్తకొత్త పదాలతో ఫ్లోకామ్‌ టెక్నాలజీ అంటూ సినిమాలు తీస్తున్నట్లు చెబుతున్నాడు. ఇవి హలీవుడ్‌లో వున్న ప్రవాసాంధ్రులు యువత డాక్యుమెంటరీలు తీసి చూపించేస్తున్నారు. ఇటీవలే అయోధ్య కుమార్‌ అనే దర్శక నిర్మాత మాట్లాడుతూ... ఈ టెక్నాలజీ కొత్తగా ఇప్పుడు రాలేదు. ఎప్పుడో వచ్చింది. దాన్ని వర్మ కొత్తగా చెప్పేదేముంది. 
 
ఏదో పేరుతో ఆయన జనాల్ని ఆకట్టుకుంటున్నాడని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన ఐదు రోజుల్లో సినిమాలు తీసేసి చుట్టేసే నిర్మాత రామసత్యనారాయణతో ఐస్‌క్రీమ్‌ సినిమాలు ఐదు భాగాలు తీస్తున్నాడు. దాంతో ఆయన క్రేజ్‌ మరింత తగ్గింది. రెమ్యునరేషన్‌ కూడా తక్కువగానే తీసుకుంటున్నాడని అంటున్నారు. బాలీవుడ్‌లో 'ఎక్సెస్‌' అనే పేరుతో సినిమా చేస్తున్నాడు. తెలుగులో 'కోరిక' పేరుతో రాబోతుంది. ఇది మలయాళ షకీలా తరహా సినిమాగా చెప్పుకుంటున్నారు. 
 
బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ను నటింపజేసేందుకు సంప్రదించారు. ఇందులో ఆమె పేరు సరళ.. ఆంటీ... అట. మరి ఆమెతో ఎటువంటి సినిమా చేస్తాడో.. దానితో ఇండస్ట్రీని ఎంతగా దిగజారుస్తాడో... అంటున్నారు సినీజనం. తొలుత సరళ ఆంటీ ఎవరబ్బా... అని ఆలోచించినవారికి అంత డౌటెందుకబ్బా అంటూ సన్నీ లియోన్ పేరును తెరపైకి తెచ్చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu